తల్లి పాల ఉత్పత్తిని పెంచడానికి ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే సరి..!

పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు కీలకం. తల్లి బలమైన ఆహారం తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. తల్లిపాలను పెంచే సూపర్ ఫుడ్స్ ఏవంటే..

ఓట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, బీటా గ్లూకాన్ కలిగి ఉంటాయి. ఇవి తల్లి పాల ఉత్పత్తిని పెంచుతాయి. 

అవిసె గింజలు..  ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నాన్స్ లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి బలహీనమైన ఈస్ట్రోజెనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. 

బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, గుమ్మడి కాయ గింజలు, నువ్వులు ఇలా ఇవన్నీ కొవ్వులు, ప్రోటీన్ లను కలిగి ఉంటాయి. కనుక ఇవి తల్లిపాల ఉత్పత్తిని పెంచుతాయి. 

గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్ ..  విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి పాల ఉత్పత్తికి మంచి ఆహారం.

చిలగడ దుంపలలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇవి తల్లిపాల రుచిని పెంచుతాయి. ఇవి గెలాక్టగోగ్ లక్షణాలు కలిగి ఉంటాయి. 

పెరుగు ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ కలిగి ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని పెంచుతాయి. 

ఖర్జూరం, ఆప్రికాట్లు ప్రోలాక్టిన్ వంటి హార్మోన్లను నియంత్రించడంలో సహకరిస్తాయి.