రోజూ ఈ చట్నీ తినండి..  ఈ సమస్యలన్నీ పరార్..

పుదీనా ఔషధాల సంజీవని. విటమిన్ ఏ, సీ, డీ, బీ కాంప్లెక్స్ విటమిన్లు పుదీనా ఆకుల్లో దండిగా ఉంటాయి. చాలా అనారోగ్యాలకు పుదీనా మంచి మందు.

పుదీనా, అల్లం కలిపి చట్నీ చేసుకుని తినడం వల్ల ప్రోటీన్ శోషణ బాగా జరుగుతుంది. ముఖ్యంగా ప్యూరిన్ అనే ప్రోటీన్ శరీరానికి అందడంలో ఈ చట్నీ ఎంతో ఉపయోగపడుతుంది. 

పుదీనాలో ఐరన్, పొటాషియం, మాంగనీస్ తగు మోతాదులో ఉంటాయి. హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉన్న వారు క్రమం తప్పకుండా పుదీనా చట్నీ తీసుకుంటే మంచిది. 

జీర్ణ క్రియ సజావుగా సాగేలా చేసి జీర్ణ వ్యవస్థకు తోడ్పాటునందించడంలో పుదీనా క్రీయాశీలకంగా పని చేస్తుంది. 

యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్న వారికి పుదీనా దివ్యౌషధం. పుదీనా క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక మోతాదులో ఉన్న యూరిక్ యాసిడ్ తగ్గుముఖం పడుతుంది.

పుదీనా శరీరాన్ని డీ హైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది. శరీరంలోని హానికర టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. 

పుదీనా యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఎముకల్లో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారు పుదీనా తీసుకోవాలి. 

మీరు తలనొప్పితో బాధపడుతున్నట్టైతే పుదీనా టీ తీసుకోండి. ఇది మందుల కంటే వేగంగా తలనొప్పిని తగ్గిస్తుంది.