మీ వయసు కంటే పదేళ్లు తక్కువగా కనిపించాలంటే..  ఈ పనులు చేయండి చాలు.. 

 సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ముఖంపై గీతలు, ముడతలు ఏర్పడతాయి.

అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ముడతలు రావడాన్ని వాయిదా వేయొచ్చు. 

 ఇందుకోసం ప్రధానంగా రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. ఇలా చేస్తే చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది.

సూర్యకాంతి నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి నాణ్యమైన సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి. 

బెర్రీలు, గింజలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

 తరచూ ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. తద్వారా రక్తప్రసరణ పెరిగి.. ముడతలు, వాపు తగ్గుతుంది. 

విటమిన్-సి సమృద్ధిగా ఉండే క్రీమ్స్ లేదా అయిల్స్ వాడడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. 

రోజూ 7 నుంచి 8 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకుంటే చర్మం తాజాగా, యవ్వనంగా ఉంటుంది.