తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.

మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. 

ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్ష కేద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒకరు చొప్పున 2,676 చీప్ సూపరిటెండెంట్‌లను నియమించారు. 

ఈ ఏడాది 5.05 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు.

పదోతరగతి విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పిస్తోంది.