దక్షిణ భారతదేశంలో తప్పక చూడాల్సిన 7 దేవాలయాలు ఇవి..

దక్షిణభారతదేశం దేవాలయాలకు చాలా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడ కొన్ని దేవాలయాలను చూస్తే విస్మయం కలుగుతుంది.  దేవతామూర్తుల రూపాలు,  శిల్పకారుల నైపుణ్యం అబ్బురం కలిగిస్తుంది.

దక్షిణ భారతదేశంలో తప్పకుండా చూడాల్సిన దేవాలయాలు 7 ఉన్నాయి.

మధురై లో మీనాక్షి అమ్మవారు మధుర మీనాక్షిగా ప్రసిద్ధి చెందింది.  ఇక్కడ సుందరేశ్వర స్వామి, మీనాక్షి అమ్మవారు దర్మనమిస్తారు.   వేలాది రంగురంగుల శిల్పాలతో కూడిన గోపురం అబ్బురపరుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా పూజలు అందుకుంటున్నారు.  భారతదేశంలోని సంపన్న దేవాలయాలలో ఇది మొదటిది.

ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో  శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఒకటి.  విష్ణు రూపుడైన రంగనాథ స్వామి శయనిస్తున్నట్టు దర్మనమిస్తాడు.

గురువాయూర్ దేవాలయం కేరళలోని ప్రసిద్ధ దేవాలయం.  ఇక్కడ ప్రధాన దైవం కృష్ణుడు. ఇక్కడ కృష్ణుడిని గురువాయూరప్పన్ అని పిలుస్తారు.

తంజావూరులోని బృహదీశ్వరాలయం యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.  11వ శతాబ్దంలో చోళ రాజు మొదటి రాజ రాజ చోళుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడు.

కేరళలో తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి.  ఇక్కడి దేవాలయం ద్రావిడ శైలిలో ఉంటుంది.

చిదంబరంలోని నటరాజ దేవాలయం చాలా ప్రఖ్యాతి చెందింది.  ఇక్కడ పరమేశ్వరుడు నటరాజు రూపంలో ఉంటాడు.  ఈ ఆలయం శిల్ప కళ,  విజ్ఞానం, ఆధ్యాత్మికతల కలయిక.