చెట్టు బెరడు రంగులో కలిసిపోయే  ఈ పక్షి గురించి తెలుసా..!

 అమెరికన్ ఉష్ణమండలానికి చెందిన ఏడు జాతుల ఒంటరి, రాత్రిపూట పక్షులలో  "పో-టూ" పక్షి కూడా ఒకటి.

బూడిద, నలుపు, గోధుమ రంగు పూతలతో చెట్టు బెరడును పోలి ఈ పక్షులు ఉంటాయి. 

పగటిపూట ఈపక్షులు నిద్రపోతాయి, చెట్టు మోడుపై నిలువుగా కూర్చుంటాయి.

అవి చనిపోయిన కొమ్మల నుండి ఎవరూ గుర్తించని విధంగా బెరడు రంగులో కలిసిపోయి కనిపిస్తాయి.

సంధ్యా సమయంలో మేల్కొంటాయి, చీకట్లో ఎగిరే కీటకాలను గుర్తించగల సామర్థ్యం పోటూ పక్షి భారీ కళ్ళకు ఉంది.

పొటూ పక్షికి ఎరను పట్టుకోవడానికి పెద్ద, విశాలమైన నోరు ఉంటుంది.

 కొమ్మల చివర్లలో కళ్ళు మూసుకుని నిశ్చలంగా ఉండే వాటిని గుర్తించడం దాదాపు అసాధ్యం.

రాత్రి సమయంలో, బీటిల్స్, చిమ్మటలు, చెదపురుగులు పట్టుకుని తింటుంది.