అడవుల్లో, ఎడారి పువ్వుల్లో తేనెను సేకరించే తేనె చీమలు ఇవి..
ఈ తేనె తాగాలంటే మాత్రం చీమను చంపాల్సిందే..!
హనీపాట్ చీమను శాస్త్రీయంగా మెలోఫోరస్ బాగోటీ లేదా కాంపోనోటస్ అని పిలుస్తారు.
హనీపాట్ చీమను పట్టుకోవాలంటే, భూమిలోకి దాదాపు 2 మీటర్లు త్రవ్వవలసి ఉంటుంది.
సేకరించిన తేనెను గుహల్లోనూ, చిన్న చిన్న ఇరుకు సందుల్లోనూ దాస్తాయి.
హనీపాట్ చీమ శరీరాలపై ఆహారం తేనె రూపంలో నిండుగా కనిపిస్తుంది.
ఎడారిలో కరువు సీజన్లలో జీవితం కష్టంగా ఉంటుంది.
ఈ రకమైన చీమల గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది కాలనీ జనాభాలో సగం ఉంటుంది.
చీమలు ప్రతి ఔన్స్‌కి ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. వీటిలో క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఎండా కాలంలో పూలు ఉండవు, మకరందం ఉండవు. కాబట్టి, ఆ కాలానికి, నిల్వ చేసుకున్న ఆహారమే వీటి ప్రధాన వనరు.
ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికాలలో ప్రధానంగా ఇవి కనిపిస్తాయి.
హనీపాట్ చీమను కనుగొని, డెజర్ట్ రెసిపీలో వాడాలంటే మాత్రం ఒకదానికి దాదాపు 20 డాలర్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందట..
ఆస్ట్రేలియాలోని ఆదివాసీ గిరిజనులైతే, హనీపాట్ చీమను ఎక్కువగా తింటూ ఉంటారు.