ఈ మొఘల్ మహారాణుల తెలివితేటలు తెలిస్తే షాకవుతారు..!
నూర్జహాన్..నూర్జహాన్ తెలివైన నిర్వాహకురాలు, వ్యూహాలు పన్నడంలో దిట్ట. జహంగీర్ పాలనలో కోర్టు రాజకీయాలు, కోర్టు విషయాలను ఆమె ప్రభావితం చేసింది.
మహమ్ అంగా..
అక్బర్ కు చాలా నమ్మకమైన మహిళ ఈమె. అక్బర్ ప్రారంభ పాలనలో సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించడంలో ఈమె కీలకపాత్ర పోషించింది.
మరియం-ఉజ్-జమానీ..
అక్భర్ హిందూ భార్య ఈమె. ఈమెనే జోధా అంటారు. తెలివైన వ్యాపారవేత్త, వ్యాపార నౌకలు, వ్యాపారం గురించి ఈమె విస్తారమైన కార్యకలాపాలు నిర్వహించేది. రాజులతో మొఘలుల ఒప్పందాలలో కీలక పాత్ర పోషించింది.
హమీదా బాను బేగం..
హుమయున్ భార్య, అక్భర్ తల్లి ఈమె. ఈమె చాలా తెలివైన మహిళ. దౌత్య చతురతలో ఈమెకు సాటి లేరు.
ముంతాజ్ మహల్..
షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ అందమైనదే కాదు.. చాలా తెలివైనది. ఈమె విశ్వసనీయ సలహాదారుగా, రాజకీయ ప్రభావశీలిగా గుర్తించబడింది.
రుకైయా సుల్తాన్ బేగం..
అక్భర్ ప్రధాన భార్య ఈమె. రాజకీయాలలో ఈమె చాలా కీలకపాత్ర పోషించారు. మొఘల్ వారసత్వ విషయాలలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
రోషనరా బేగం..
ఈమె ఔరంగజేబు సోదరి. తెలివైన వ్యూహాలు పన్నడంలో దిట్ట. ఔరంగజేబు సింహాసనం అధిరోహించడంలో ఈమె కీలకపాత్ర పోషించింది.
జహనారా బేగం..
ఈమె షాజహాన్ కుమార్తె. ప్రభావ వంతమైన కవయిత్రి, పండితురాలు, కోర్టు రాజకీయాలు, వారసత్వ విషయాలలో కీలకపాత్ర పోషించింది.