తేనె గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు ఇవీ..
తేనెను ఆయుర్వేదంలో మధు అని పిలుస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
కాలిన గాయాల మీద తేనెను లేపనంలా రాస్తుంటే మచ్చలు పడకుండా గాయం మానిపోతుంది.
తేనెలో విటమిన్-బి6, విటమిన్-సి, విటమిన్-డి ఉంటాయి.
మెగ్నీషియం, కాల్షియం, కాపర్, పొటాషియం, మాంగనీస్, జింక్ వంటి ఖనిజాలు తేనెలో ఉంటాయి.
శీతాకాలంలో తేనె తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి.
గుండె ఆరోగ్యాన్నిమెరుగ్గా ఉంచడంలో కూడా తేనె సహాయపడుతుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి టిఫిన్ తినడానికి ముందు తాగాలి. ఇందులో నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇది జీవక్రియను మెరుగ్గా ఉంచుతుంది.
రాత్రి ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. నిద్ర బాగా వస్తుంది.
తేనెను ముఖానికి పొరలాగా లేపనం వేసుకుని 10 నిమిషాల తరువాత ముఖం కడిగేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. మచ్చలేని చర్మాన్ని అందిస్తుంది.
Related Web Stories
భారత్లో వాయుకాలుష్యం అత్యల్పంగా ఉన్న ప్రాంతాలు ఇవే!
పిల్లలకు చదువుతో పాటు ఇవి కూడా ముఖ్యం..!
ఇలా అయితేనే సూర్యుడి నుంచి మనకు తగినంత విటమిన్-డి అందుతుంది..
మీ టవల్ను ఉతక్కుండానే వాడుతున్నారా..!