కింగ్ కోబ్రా గురించి చాలామందికి తెలియని నిజాలివి..!
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. ఇది 18 అడుగుల(5.5మీటర్లు) వరకు పెరుగుతుంది.
కింగ్ కోబ్రా విషంలో న్యూరోటాక్సిన్లు ఉంటాయి. ఆన్ ది స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోవడానికి ఇది కారణం అవుతుంది.
కింగ్ కోబ్రాలు కొండచిలువలతో సహా ఇతర విషపూరిత జాతులను తింటాయి.
భారతదేశంలోనూ, ఆగ్నేయాసియా, చైనాలోని కొన్ని ప్రాంతాలలోనూ కింగ్ కోబ్రాలు ఉంటాయి.
ఉష్ణ మండల ప్రాంతాలు, వర్షాలు పడే అడవులు, చిత్తడి నేలలు అంటే కింగ్ కోబ్రాలకు ఇష్టం.
కింగ్ కోబ్రాలు తమ శరీరంలో మూడు వంతుల వరకు శరీరాన్ని భూమి నుండి పైకి లేపుతాయి.
కింగ్ కోబ్రాలు వేటాడేటప్పుడు ఎరను భయపెట్టడానికి విలక్షణమైన కేకలాంటి ధ్వనిని విడుదల చేస్తాయి.
కింగ్ కోబ్రాలు చాలా బాధ్యతగా ఉంటాయి. అవి సొంతంగా గూడు నిర్మించుకుని గుడ్లు పెడతాయి. గుడ్లు పొదిగేవరకు కాపలా ఉంటాయి.
సరైన సంరక్షణ ఉంటే కింగ్ కోబ్రాలు 20 ఏళ్ల కంటే ఎక్కువకాలం బ్రతుకుతాయి.
Related Web Stories
గోరింటాకు వల్ల ఇన్నీ లాభాలున్నాయా..
పరీక్షకు ముందు రోజు విద్యార్థులు అస్సలు చేయకూడని పనులు!
వాస్తుశాస్త్రం ప్రకారం మీ వ్యాలెట్లో ఉండకూడని వస్తువులు!
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పువ్వులు ఇవే..