రోజూ వినియోగించే వస్తువులు శుభ్రంగా ఉంటాయని అనుకుంటారు. కానీ మరుగుదొడ్డి కంటే గలీజుగా ఉంటే ఆ 10 వస్తువులు ఏంటంటే..
ఫోన్లలోనూ బ్యాక్టీరియా, వైరస్, అనేక రకాల సూక్ష్మజీవులు పేరుకుపోయి ఉంటాయి. ఇది మరుగొడ్డి కంటే అపరిశుభ్రంగా ఉంటుంది.
తరచూ వంటగదిలో వాడే స్పాంజ్‌లో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే దీన్ని క్రమం తప్పకుండా మార్చాలి.
వంటింట్లో కూరగాయలు, మాంసాన్ని కట్ చేసుకునేందుకు వాడే చెక్కలను కూడా శుభ్రం చేయాల్సి ఉంటుంది.
మేకప్ బ్రష్‌లను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
బాత్‌రూమ్‌లు, వంటింట్లో చేతులు శుభ్రం చేసుకునే టవల్స్‌ను తరచూ మారుస్తూ ఉండాలి.
కంప్యూటర్ కీబోర్డుల్లోనూ దుమ్ము, ధూళితో పాటూ సూక్ష్మజీవులు పేరుకుపోయి ఉంటాయి. తరచూ శుభ్రం చేయకపోతే అధ్వానంగా మారుతాయి.
హ్యాండ్ బ్యాగులు, పర్సుల్లోనూ అనేక రకాల క్రిములు ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ శుభ్రం చేసుకోవాలి.
టూత్ బ్రష్ హోల్డర్లు బాత్ రూమ్‌లోనే ఉండడం వల్ల తేమ కారణంగా బ్యాక్టీరియా పేరుకుపోతుంది. అందుకే తరచూ శుభ్రం చేయాలి.
టీవీ రిమోట్‌లోనూ బ్యాక్టీరియా, వైరస్ ఉంటుంది. శుభ్రం చేయకపోతే మరుగుదొడ్డి కంటే ఘోరంగా మారుతుంది.
కిచెన్‌లోని సింక్ కూడా బ్యాక్టీరియాకు నిలయంగా ఉంటుంది. దీన్నీ క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.