మీ జీవక్రియ బలంగానే ఉందా? ఈ 6 విషయాలు గమనిస్తే సరి..!

కేలరీలను, కొవ్వును బర్న్ చేసే సామర్థ్యం జీవక్రియపైనే ఆధారపడి ఉంటుంది. ఆహారాన్ని శక్తిగా మార్చేది జీవక్రియే. జీవక్రియ బలంగా ఉందా లేదా 6 విషయాలు గమనించడం ద్వారా తెలుసుకోవచ్చు.

బరువు పెరగడం లేదా తగ్గడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టైతే జీవక్రియ నెమ్మదిగా ఉందని అర్థం.

రోజంతా నీరసంగా, అలసటగా, శక్తి తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంటే అది జీవక్రియ నెమ్మదిగా ఉన్నట్టు.

శరీరం ఎప్పుడూ చల్లగా ఉండటం, చల్లని ఉష్ణోగ్రతకు శరీరం సున్నితంగా స్పందించడం జరుగుతుంటే జీవక్రియ నెమ్మదిగా ఉందని అర్థం.

ఉబ్బరం, మలబద్దకం, జీర్ణ అసౌకర్యాలు ఉంటే జీవక్రియ నెమ్మదిగా ఉన్నట్టే.

శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడమనే సమస్య జీవక్రియ నెమ్మదిగా ఉండటం వల్ల సంభవిస్తుంది.

జీవక్రియ నెమ్మదిగా ఉంటే శరీరంలో కొవ్వులను ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.  ఇది అధిక కొలెస్ట్రాల్ కు దారితీయవచ్చు.