మనుషులతో పోల్చుకుంటే కొన్ని పక్షులు, జంతువులకు మెమొరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఈ ఏడు జీవులతకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. అవేంటంటే..
డాల్పిన్లకు మెమొరీ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే విడిపోయిన సుమారు 20 ఏళ్ల తర్వాత కనపడ్డా కూడా వాటి సహచరులను, వాటి సంకేతాలను గుర్తుపట్టగలవు.
చింపాజీలకూ చాలా మెమరీ పవర్ ఉంటుంది. వాటి నివాస స్థలంలో వివిధ రకాల పండ్లు, మొక్కలు ఎక్కడెక్కడున్నాయో గుర్తుంచుకోగలవు.
గుర్రాలు కూడా వివిధ రకాల స్థలాలను, వ్యక్తులను చాలా కాలం పాటు గుర్తుపెట్టుకుంటాయి.
ఏనుగులకూ జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఇతర ఏనుగుల జాడ, వలస వెళ్లే సమయంలో ఆ మార్గాన్ని ఎంతో బాగా గుర్తు పెట్టుకుంటాయి.
ఆక్టోపస్‌లు కూడా ఎంతో జ్ఞాపకశక్తిని కలిగి ఉంటాయి. ఇవి తక్కువ కాలం జీవించినా.. అన్నీ గుర్తుపెట్టుకోగలవు.
పావురాలకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. వందల మైళ్ల దూరం ప్రయాణించినా.. తిరిగి వెళ్లే క్రమంలో వచ్చిన మార్గాన్ని సులభంగా గుర్తించగలవు.
కొర్విడ్ జాతికి చెందిన కాకులు తదితర పక్షులకూ
మెమొరీ
పవర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వాటి ఆహార నిల్వలను సులభంగా గుర్తుపెట్టుకుంటాయి.