బీపీ కంట్రోల్‌లోకి రావాలంటే.. వీటిని తాగండి..!

మందార టీలో యాంటీ-ఆక్సిడెంట్స్, ఆంతోసియానిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

దానిమ్మలో చాలా విలువైన యాంటీ-ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కూడా బీపీని కంట్రోల్‌లోకి తీసుకొస్తాయి. 

బీట్‌రూట్‌లో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను వ్యాకోచింపచేస్తాయి. రక్తప్రసరణ సజావుగా సాగేలా చూసి బీపీని తగ్గిస్తాయి. 

యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-ఆక్సిడెంట్స్ పవర్ హౌస్ అయిన క్రాన్‌బెర్రీ జ్యూస్ బీపీ పేషెంట్లకు చాలా మంచి చేస్తుంది. 

కాల్షియం, విటమిన్-డికి మంచి సోర్స్ అయిన పాలు బీపీ నియంత్రణకు చాలా ఉత్తమం. తక్కువ కొవ్వు ఉన్న పాలను తీసుకోవడం ఉత్తమం. 

పాలీ ఫినాల్స్, కెటాచిన్స్ వంటి సమ్మేళనాలను కలిగి ఉండే గ్రీన్ టీ బీపీని కంట్రోల్‌లో ఉంచి గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

పలు ఆకుకూరలతో చేసిన జ్యూస్‌లు ధమనుల కండరాలను రిలాక్స్ చేస్తాయి. ఫలితంగా రక్తప్రసరణ సజావుగా సాగుతుంది.