జీవితాన్ని అందంగా మార్చే 8 అలవాట్లు ఇవీ..!
జీవితం అందంగా, సంతోషంగా ఉండటానికి ప్రత్యేకంగా ఒక నియమం, సూత్రమంటూ లేదు. ఈ అలవాట్లతో జీవితం అదే సంతోషంగా మారుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తినే ఆహారమే ఆయుష్షును పెంచుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. సీజనల్ పండ్లు, కూరగాయలు బాగా తీసుకోవాలి.
విశ్రాంతి విషయంలో రాజీ పడకూడదు. రోజూ 6 నుండి 7 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.
వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
ఒత్తిడి, ఆందోళన మనసును పాడు చేయడమే కాకుండా శరీరాన్ని అలసిపోయేలా చేస్తుంది. దీన్ని అధిగమించడానికి రోజూ 10నిమిషాలు శ్వాస వ్యాయామాలు చెయ్యాలి.
శరీరంలో నీటి శాతం తక్కువ ఉంటే కండరాలలో ఒత్తిడి, కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలొస్తాయి. శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. అందుకే తగినంత నీరు తాగాలి.
స్నేహితులు, బంధువులమి కలవడం, సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకోవడం వంటివి చేయడం వల్ల అప్డేటెట్ గా ఉండొచ్చు.
అధిక బరువు అనేక వ్యాధులకు కారణం అవుతుంది. బరువు తగ్గించుకుంటే బోలెడు చింత వదులుతుంది.
టీవి, మొబైల్, సిస్టమ్ ముందు ఎక్కువ సమయం గడపకూడదు. ఇది క్రమంగా ఒంటరితనానికి దారితీస్తుంది. డిప్రెషన్ కు గురిచేస్తుంది.
Related Web Stories
భారత డ్రైవింగ్ లైసెన్స్‌తో ఏయే దేశాల్లో వాహనాలు నడపొచ్చంటే..
మీ కారుకు సీటు బెల్ట్ ఉందా?
అనవసర ఆలోచనలతో సతమతమవుతున్నారా?
జుట్టు మందంగా పెరగాలంటే తినాల్సిన 9 ఆహారాల లిస్ట్ ఇదీ..!