ఈ ఉదయపు చెడ్డ అలవాట్ల వల్ల బరువు పెరుగుతారట..!
ఉదయం ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలుగుతుంది. ఇది జీవక్రియను దెబ్బతీసి బరువు పెరగడానికి కారణం అవుతుంది.
ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం వల్ల నేరుగా అల్పాహారం, టీ, కాఫీ వంటివి తాగుతారు. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. అతిగా తినేలా ప్రేరేపిస్తుంది.
ఉదయాన్నే నిద్ర లేవకపోతే చాలామందిలో నిద్రలేమి, బద్దకం, ఏ పని చేయాలని అనిపించకపోవడం వంటివి జరుగుతాయి.
ఉదయం లేటుగా నిద్ర లేస్తే వ్యాయామం చేసే సమయం ఉండదు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
ఉదయాన్నే టీ లేదా సోడా వంటి తీపి పానీయాలు తాగేవారు తొందరగా బరువు పెరుగుతారు.
ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే చాలామంది అల్పాహారాన్ని స్కిప్ చేస్తుంటారు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఉదయాన్నే అల్పాహారంలో ప్రోటీన్ తీసుకోని వారు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ.
ఉదయాన్నే అధిక కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారం తీసుకున్నా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారి తీస్తాయి.
ఫోన్ లేదా టీవి వంటివి చూస్తూ తినే అలవాటు ఉన్నవారు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ.
Related Web Stories
అత్యంత సంతోషంగా ఉండే జీవులివే
సిక్రెట్ కెమెరాలను ఈ ట్రిక్స్‌తో గుర్తించండి
బెల్లం vs పంచదార: బెల్లం ఎందుకు మంచిదంటే..
విటమిన్-సి ఆడవాళ్ల కంటే మగవారికే ఎక్కువ ముఖ్యం.. ఎందుకంటే..!