చిన్నప్పటి నుండి ఉదయాన్నే నిద్రలేచే అలవాటు చేయడం వల్ల పిల్లలు చురుగ్గా ఉంటారు. సమయాన్ని పూర్తిగా వినియోగించుకోగలుగుతారు..
ఉదయాన్నే నిద్రలేవడమే కాదు.. రాత్రి సరైన సమయానికి నిద్రపోయే పిల్లలు మానసికంగా దృఢంగా ఉంటారు.
ఏ మతం వారైనా పిల్లలతో ఉదయాన్నే దేవుడికి నమస్కరించడం నేర్పాలి. ఇది కృతజ్ఞతా భావాన్ని పెంచుతుంది.
పిల్లలు పుస్తకాలు చదవడం ద్వారా నైతిక విలువలు పెంపొందించుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చదవడం ద్వారా వారిలో పఠనాభిరుచిని పెంపొందించవచ్చు.
పిల్లలను ఎప్పుడూ చదువుకోమని ఫోర్స్ చేయకూడదు. వారికి టైమ్ టేబుల్ రూపొందించాలి. సమయానికి పనులు చేయడం చురుగ్గా ఉండటం దీనివల్ల సాధ్యమవుతుంది.
పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. కానీ వారంలో ఒక్కరోజు మాత్రమే దానికి అనుమతించాలి. మిగిలిన రోజుల్లో ఆరోగ్యంగా ఉండటానికి పండ్లు ఇవ్వాలి.
పిల్లలు తమ చిన్న చిన్న పనులు తామే స్వంతంగా చేసుకునేలా ప్రోత్సహించాలి. పనులు చక్కగా చేసినప్పుడు వారిని ప్రశంసించడం మరచిపోకూడదు.
పిల్లలకు కూడా చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో నువ్వైతే ఏం చేయగలవు అని ప్రశ్న వేసి వారి సమస్యలకు వారే పరిష్కారం కనుగొనే దిశగా ప్రేరేపించాలి.
పిల్లలలో ఉండే అభిరుచి వారిలో మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే పిల్లల అభిరుచులను ప్రోత్సహించాలి.