మాంసాహారాన్ని తలదన్నే శాకాహార ఆహారాలు ఇవే..!

మినప్పప్పు, పెసలు, రాజ్మా, బొబ్బర్లు వంటి పప్పు ధాన్యాలలో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. మాంసాహారాన్ని మించిన శక్తిని ఇవి అందిస్తాయి.

పప్పు ధాన్యాలు..

శనగలు..

రోజూ గుప్పెడు కాల్చిన శనగలు తిన్నా, ఉడికించి తిన్నా, కూరల్లో వాడినా  అద్బుత ఫలితాలు ఇస్తాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

 టోఫు..

టోపునే జున్ను అంటారు. దీంట్లో   ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న కారణంగా ఇది మాంసాహారాన్ని బీట్ చేస్తుంది.

మొక్కల ఆధారిత మాంసాలు..

ప్లాంట్ బేస్డ్ మీట్ ఇప్పట్లో విరివిగా దొరుకుతుంది. ఇది అచ్చం మాంసాహారాన్ని తలపిస్తుంది. పోషకాలలో కూడా ఏ మాత్రం లోపముండదు.

క్వినోవా..

క్వినోవా బెస్ట్ ప్రోటీన్ సూపర్ ఫుడ్. దీన్ని స్టైర్ ఫ్రై గానూ, స్టఫింగ్స్ లోనూ వాడొచ్చు. ఇది మెత్తగా చాలా రుచిగా ఉంటుంది.

పుట్టగొడుగులు..

పుట్టగొడుగులు తేలికగా పోటీన్లతో నిండి ఉంటాయి. ఫైబర్ కూడా అధికం. శరీరానికి అమితమైన శక్తినిస్తాయి.

సీటాన్..

సీటాన్ ను గోధుమ గ్లూటెన్ తో తయారుచేస్తారు.  దీన్ని తినేటప్పుడు అచ్చం మాంసాన్ని పోలి ఉంటుంది.

పనసపండు..

ఫైబర్ తో నిండిన పనసపండులో ప్రోటీన్స్ సూపర్ గా ఉంటాయి.  పనసకాయతో వండిన వంటలు మాంసాహారాన్ని మించి  శక్తినిస్తాయి.

వంకాయ..

వంకాయలు మాంసాహారంతో తూచదగిన శక్తిని కలిగి ఉంటాయి.  దీన్ని బోలెడు రకాలుగా ఆహారంలో  భాగం చేసుకోవచ్చు.

బ్లాక్ బీన్స్..

ప్రోటీన్, పైబర్ అధికంగా ఉండే బ్లాక్ బీన్స్  మాంసాహారం కంటే ఎక్కువ శక్తిని ఇస్తాయి.