ఈ జీవులు ఏమీ తినకపోయినా.. వారాల తరబడి బతికేస్తాయి..

ఎడారి ప్రాంతాల్లో నివసించే ఒంటెలు ఆహారం లేకపోయినా కొన్ని వారాల పాటు బతకగలవు. ఎందుకంటే అవి కొవ్వును నిల్వ చేసుకుని అవసరమైన సమయంలో వాడుకుంటాయి.

మొసళ్లు ఆహారం లేకుండా కొన్ని నెలల పాటు జీవిస్తాయి. ఆహారం అందుబాటులో లేని సమయంలో మొసళ్లు మెటబాలిజమ్‌ను తగ్గించుకుంటాయి.

పాములు కూడా ఆహారం లేకుండా నెల రోజుల పాటు బతకగలవు. ఆహారం అందుబాటులో లేని సమయంలో పాములు మెటబాలిజమ్‌ను తగ్గించుకుంటాయి.

ఎడారి తాబేళ్లు నీరు, ఆహారం లేకుండా వారాల తరబడి మనుగడ సాగించగలవు. అవి నీరు, కొవ్వును తమ శరీరంలో నిల్వ చేసుకుంటాయి.

అంటార్కిటికాలోని మంచు నీటి సరస్సులో నివసించే కొన్ని చేపలు కూడా ఆహారం లేకుండా నెలల తరబడి బతికేస్తాయి.

ఎలుగుబంట్లు తమ శరీరంలో కొవ్వును నిల్వ చేసుకుంటాయి. ఆహార లభ్యత లేని సమయంలో ఆ కొవ్వును కరిగించి వాడుకునే సామర్థ్యం వాటికి ఉంటుంది.

ట్రాడిగ్రేడ్స్ అనే జీవులు కూడా ఆహారం లేకపోయినా వారాల తరబడి జీవించగలవు. ఇవి ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించగలిగే అరుదైన జంతువులు.