ప్రపంచంలో అద్భుతమైన  జ్ఞాపకశక్తి కలిగిన జంతువులు ఇవే..!

ఏనుగులు.. ఏనుగుల జ్ఞాపకశక్తి అమోఘం.  ఇవి వలస వెళ్లే మార్గాలను అద్భుతంగా గుర్తుపెట్టుకోగలవు. ఏదైనా ఒకసారి చూస్తే సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపట్టగలవు.

డాల్ఫిన్లు.. డాల్ఫిన్ల జ్ఞాపకశక్తి అద్బుతం.  ఇవి విడిపోయిన 20 సంవత్సరాల తర్వాత కూడా తమ భాగస్వామిని గుర్తించగలవు. కమ్యునికేషన్ సామర్థ్యం చాలా ఎక్కువ.

చింపాంజీలు.. చింపాంజీలు ఆహార వనరుల స్థానాలను చాలాబాగా గుర్తుపెట్టుకుంటాయి. గత సంఘనలను,  వాటి అనుభవాలను ఇవి బాగా గుర్తుపెట్టుకుంటాయి.

ఓర్కాస్.. ఓర్కాస్ అసాధారణమైన జ్ఞాపకశక్తి కలిగి ఉంటాయి.  వేటాడటంలో వీటి జ్ఞాపకశక్తి ప్రధానపాత్ర పోషిస్తుంది.

కాకులు.. కాకులకు జ్ఞాపకశక్తి ఎక్కువ. ఆహార వనరుల స్థానాలను బాగా గుర్తుంచుకుంటాయి. విభిన్న వాతావరణంలో జీవించడం కోసం వీటి జ్ఞాపకశక్తి బాగా సహాయపడుతుంది.

ఆక్టోపస్ లు.. ఆక్టోపస్ లు ప్రమాదం నుండి తప్పించుకోవడంలో చాలా తెలివి ప్రదర్శిస్తాయి. మనుషులను గుర్తిస్తాయి.  మనుషులను మభ్యపెట్టి తప్పించుకుంటాయి.

కుక్కలు.. కుక్కలు విశ్వాసంతో పాటూ జ్ఞాపకశక్తి కూడా కలిగి ఉంటాయి. యజమాని చెప్పిన మాట వినడం, అనుకరించడం,  గుర్తుంచుకోవడం వీటి జ్ఞాపకశక్తిని స్పష్టం చేస్తుంది.