కొన్ని జీవులు నిత్యం నీటిలోనే ఉన్నా బయటికి రాకుండా ఎక్కువ సేపు ఉంటే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ జంతువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

మొసళ్లు నీటిలో ఎక్కవ సమయం ఉన్నా కూడా బయటికి వస్తూపోతూ ఉంటాయి. లేదంటే ఇవి కూడా శ్వాస ఆడక చనిపోవచ్చు. 

నీటి అడుగున సంచరించే డాల్ఫిన్లు కూడా మధ్య మధ్యలో ఉపరితలం పైకి వస్తుంటాయి. 

కొన్ని తాబేళ్లు నిత్యం నీటి అడుగున జీవిస్తున్నా కూడా.. అప్పుడప్పుడూ పైకి వచ్చి గాలీ పీల్చుకుని వెళ్తాయి. లేదంటే వాటి ప్రాణాలకే ప్రమాదం తలెత్తవచ్చు. 

కొన్ని రకాల పాములు కూడా నిత్యం నీటిలో ఉన్నా అప్పుడప్పుడూ బయటికి వస్తూ పోతూ ఉంటాయి. లేదంటే ఇవి కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది.

తిమింగలం కూడా నీటి అడుగులో ఎక్కువ సేపు ఉండలేదు. అప్పుడప్పడూ పైకి వచ్చి శ్వాస తీసుకుని వెళ్తుంటుంది.