ప్రపంచంలో కొన్ని జీవులు అనేక రంగుల్లో అందరినీ అలరిస్తుంటాయి. వీటిలో ప్రధానంగా 10 జీవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణ అమెరికాలో కనిపించే పాయిజన్ డార్ట్ అనే కప్పలు ఎరుపు, నీలం, పసుపు రంగులో అందంగా ఉన్నా ముట్టుకుంటే ప్రమాదం.
ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే పీకాక్ స్పైడర్ అనే సాలీళ్లు కూడా వివిధ రంగుల్లో చూపరులను కట్టి పడేస్తుంది.
పసిఫిక్ మహా సముద్రంలో కనిపించే మాండరిన్ చేప ఎంతో కలర్‌ఫుల్‌గా ఉంటుంది. నీలం, నారింజలతో నీటిలో ఎంతో అందంగా కనిపిస్తుంటుంది.
దక్షిణ అమెరికాలో కనిపించే స్కార్లెట్ మాకా అనే చిలుక ఎరుపు, పసుపు, నీలం రంగులో చూపరులను ఆకట్టుకుంటుంది.
హార్లెక్విన్ ష్రిమ్ప్ అనే రొయ్యలు నారింజ, తెలుపు, ఊదా రంగులో పసిఫిక్ మహా సముద్రంలోని పగడపు దిబ్బల వద్ద నీటి అడుగులో అందంగా కనిపిస్తుంటాయి.
దక్షిణ మెక్సికో అడవుల్లో కనిపించే కీల్-బిల్డ్ టౌకాన్ అనే పక్షులు నలుపు, పసుపు రంగుల్లో అలరిస్తుంటాయి.
ఇండో- పసిఫిక్‌లో కనిపించే ప్యారెట్ షిష్ అని పిలువబడే చేపలు కూడా బ్లూస్, పర్పుల్ రంగులో ఎంతో ప్రకాశవంతంగా ఉంటాయి.
ఆర్కిడ్ మాంటిస్ అనే కీటకాలు గులాబీ, తెలుపు రంగులో పువ్వుల్లో కలిపోయి.. ఆకస్మికంగా దాడి చేస్తుంటాయి.
ఉత్తర క్వీన్స్‌లాండ్ నుంచి దక్షిణ ఆస్ట్రేలియా వరకూ కనిపించే రెయిన్‌బో రోరిటీక్ అనే చిలుకలు.. ఇంద్రధనస్సు రంగుల్లో ఆకట్టకుంటాయి.
దక్షిణ అమెరికా, మెక్సికోలో కనిపించే బ్లూ మెర్ఫో అనే సీతాకోకచిలుకలు నీలి రంగులో సూర్య కాంతిలో మెరుస్తూ ఆకట్టుకుంటాయి.
Related Web Stories
పంజాబ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇవే..
తెల్ల రక్త కణాల సంఖ్య పెంచే ఫుడ్స్!
అతిగా టీ తాగితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్!
గంటపాటు లైట్లు ఎందుకు ఆర్పాలంటే..