బియ్యం పిండితో చేసే 10 సాంప్రదాయ భారతీయ వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణ భారతీయ దేశంలో ఎక్కువగా లభించే ఇడియప్పం వంటకాన్ని బియ్యం పిండితో చేస్తారు. దీనికి బెల్లం, కొబ్బరి పాలు జత చేస్తే రుచిగా ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన సర్వపిండి కూడా బియ్యం పిండి, శనగపప్పుతో కలిపి తయారు చేస్తారు.

తమిళనాడు, కేరళ, కర్నాటకలో ఎక్కువగా లభించే పుట్టు అనే వంటకాన్ని బియ్యం పిండి, కొబ్బరి తురుముతో తయారు చేస్తారు.

కర్నాటకలో ఎక్కువగా లభించే పలుచటి నీర్ దోశను బియ్యం పిండితో తయారు చేస్తారు.

బియ్యం, శెనగపిండి, కొత్తిమీర, పచ్చిమిరప తదితరాలతో చేసే రైస్ చీలా వంటకం నార్త్ ఇండియాలో ఎంతో ఫేమస్.

దక్షిణ భారత దేశ ప్రాచీన వంటకమైన దోశను.. బియ్యం పిండి, మినపప్పుతో కలిపి చేస్తారు.

గుజరాతీ సాంప్రదాయ వంటకమైన ఖిచును బియ్యం పిండితో చేస్తారు. ఇది అచ్చం ఉప్మాలాగే ఉంటుంది.

మాల్వాణి అంబోలి అనే వంటకాన్ని కూడా బియ్యం పిండితోనే తయారు చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన మురుకులను కూడా బియ్యం, శనగపిండితో కలిపి తయారు చేస్తారు.

బియ్యం పిండి, పెరుగు తదితరాలను అరటి ఆకుల్లో ఉంచి ఉడికించి చేసే రైస్ పంకి గుజరాత్‌లో ఎంతో ఫేమస్.