రోజూ వాకింగ్ చేసే సమయంలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల అందుకు తగ్గ ఆరోగ్య ప్రయోజనాలను పొందలేరు. 

రోజూ నడవడంతో పాటూ నడిచే వేగం కూడా సరిగ్గా ఉండాలి. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో నడిస్తే ప్రయోజనం ఉంటుంది. 

నడిచే సమయంలో మీ రెండు చేతులను సరైన దిశలో వేగంగా కదిలించాలి. 

నడకకు ముందు, తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు. కనీసం 20-25 నిమిషాల గ్యాప్ ఉండాలి. 

నడిచే సమయంలో మెడ ముందుకు వంచడం, ఫోన్ చూడడం చేయకూడదు. సరైన పద్ధతిలో నడిస్తే ప్రయోజనం ఉంటుంది. 

నడకతో పాటూ శరీరానికి తగినంత విశ్రాంతి చాలా ముఖ్యం.