గడ్డ కట్టే చలిలోనూ కొన్ని జంతువులు జీవించగలుగుతాయి. అవేంటంటే.. 

ఆసియా పర్వత శ్రేణుల్లో కనిపించే మంచు చిరుత గడ్డ కట్టే చలిలోనూ జీవించగలదు. 

ఆర్కిటిక్‌కు చెందిన మంచు గుడ్లగూబలు ఇన్సులేటింగ్ కొవ్వు పొరతో ఉండడం వల్ల చలిని తట్టుకోగలవు. 

ఆర్కిటిక్ తోడేళ్లు మండపాటి బొచ్చు, చర్మంతో ఉండడం వల్ల చలి, మంచులోనూ జీవించగలవు. 

దట్టమైన బొచ్చు, కొవ్వు పొరతో కూడిన ధ్రువపు ఎలుగుబంట్లు గడ్డ కట్టే చలిలోనూ జీవిస్తాయి. 

ఆర్కిటిక్‌లో కనిపించే కుందేళ్లు కూడా మందపాటి తెల్లటి బొచ్చుతో ఉంటాయి. 

అంటార్కిటికాకు చెందిన చక్రవర్తి పెంగ్విన్లు కూడా కఠినమైన చలిని తట్టుకోగలవు. 

ఆర్కిటిక్ టండ్రాకు చెందిన కస్తూరి ఎద్దులు గడ్డ కట్టే చలిలోనూ జీవించగలవు. 

ఆర్కిటిక్ సముద్రాల్లో కనిపించే గడ్డం సీల్ ఎంతటి చలినైనా తట్టుకుంటాయి.