శరీరంలో విటమిన్ B12 తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో కనిపించే 8 సంకేతాలు ఇవే..
అలసట, బలహీనత కారణంగా శక్తిలేనట్టుగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తి చేయడానకి B12 కీలకం కాబట్టి ఇలా జరుగుతుంది.
పాలిపోయిన చర్మం.. ఎర్ర రక్త కణాలు పెద్దవిగా, పెళుసుగా ఉండే మెగాలోబ్లాస్టిక్ అనీమియా కారణంగా చర్మం లేతగా లేదా పసుపు రంగులో కనిపిస్తుంది.
తక్కువగా ఉన్న B12 స్థాయిల కారణంగా నరాలు దెబ్బతినడం వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిరి, జలదరింపు, చర్మం ముడతలు పడటం అనే లక్షణాలు ఉంటాయి.
తీవ్రమైన నరాల బాధ వల్ల నడక సమస్యలు, విషయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది.
నోటి పూత, నాలుక వాపు, పుండ్లు, ఎరుపుగా మారడం వంటి నోటి సమస్యలు ఉంటాయి.
దృష్టి సమస్యలు కూడా ఈ విటమిన్ లోపంతో ఉంటాయి. కంటి చూపు అస్పష్టంగా లేదా చెదిరినట్టుగా ఉంటుంది.
తక్కువ B12 మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే విధంగా ఇది జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, ఆలోచించడంలో కష్టం, మానసిక స్థితిలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
శ్వాస ఆడకపోవడం B12 లోపం వల్ల వచ్చే రక్తహీనతతో గుండె దడతోపాటు శ్వాస ఆడకపోవడం అనే సమస్య కూడా ఉంటుంది. ముఖ్యంగా శారీరక శ్రమ చేస్తున్న సమయంలో ఈ ఇబ్బంది ఉంటుంది.