అరోమా థెరపీ గురించి విన్నారా? దీంతో లాభాలేంటంటే..!

అరోమా థెరపీ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉపయోగించి చేసే నేచురల్ ట్రీట్మెంట్. ఈ థెరపీ వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి.

ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో అరోమా థెరపీ సహాయపడుతుంది. లావెండర్, జాస్మిన్ వంటి నూనెలు మససుకు ఊరట ఇస్తాయి.

లావెండర్ , శాండల్ నూనెలు శరీరానికి విశ్రాంతి ఇవ్వడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

అరోమా థెరపీలో వాడే కొన్ని నూనెలు కండరాల నొప్పి,  కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

అరోమా థెరపీలో వాడే నూనెలు అజీర్ణం, గ్యాస్, వికారం వంటి సమస్యలను తగ్గిస్తాయి.

ఎసెన్షియల్ ఆయిల్స్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

అరోమా థెరపీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.  ముఖ్యంగా సిట్రస్ ఆధారిత నూనెను ఉత్సాహాన్ని ఇస్తాయి.

మొటిమలు, తామర, పొడిచర్మం వంటివి తగ్గించడంలో అరోమా థెరపీలో ఉపయోగించే నూనెలు సహాయపడతాయి.

పిప్పరమెంట్,  లావెండర్ నూనెలు వాడితే తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు తగ్గుతాయి.

పుదీనా,  యూకలిప్టస్(నీలగిరి) నూనెలు సైనస్ సమస్యలలోనూ,  శ్వాస సమస్యలు తగ్గించడంలోనూ సహాయపడతాయి.

అరోమా థెరపీ ధ్యానంలో చాలా బాగా సహాయపడుతుంది.   ఈ సువాన మధ్య ధ్యానానికి కూర్చొంటే ఎక్కువసేపు ఏకాగ్రత ఉంటుంది.