రోజూ 15 నిమిషాలు వాకింగ్ చేస్తే ఈ 6 ప్రయోజనాలు మీ సొంతం..!

15 నిమిషాలు వాకింగ్ చేస్తే ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.  ఇవి హ్యాపీ హార్మోన్లుగా పిలవబడతాయి. బాధను తగ్గించి సంతోషాన్ని ఇస్తాయి.

బరువు తగ్గాలని అనుకునే వారు కనీసం 15నిమిషాల నడకతో వాకింగ్ ను ప్రారంభించాలి.  ఇది శరీరంలో కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం కాపాడుకోవడంలోనూ,  స్ట్రోక్ ప్రమాదాలు తగ్గించడంలోనూ కనీసం 15నిమిషాల నడక సహాయపడుతుంది.

నడుము నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే రోజూ 15 నిమిషాలు వాకింగ్ చేయాలి.

రోజూ 15నిమిషాలు వాకింగ్ చేస్తుంటే శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.  శరీరం స్టామినా కూడా పెరుగుతుంది.  పనుల కారణంగా అలసిపోవడం తగ్గుతుంది.

15నిమిషాల నడక మోకాళ్ల నొప్పుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఎముకల వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతుంది.