అన్నం వండి గంజి నీళ్లు పడేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!

అన్నం చాలా రాష్ట్రాలలో ప్రధాన ఆహారం.

అన్నం ఉడికిన తరువాత నీటిని వంపేస్తారు.  దీన్నేగంజి నీళ్లు అని అంటారు.

గంజి నీళ్లను సింకులో పోయడం లేదా పారబోయడం చాలామంది చేసే పని.

గంజి నీళ్లలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వ్యాయామం తర్వాత, అలసటగా ఉన్నప్పుడు గంజి నీళ్లు తాగితే తక్షణ శక్తి ఇస్తుంది.

డయేరియా,  అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో గంజి నీరు  పనిచేస్తుంది.

 జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  పేగు ఆరోగ్యాన్ని,  గట్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

బియ్యం గంజిలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి.  శరీరాన్ని హైడ్రేట్ చేసి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ను నిర్వహిస్తుంది.

వండిన అన్నం నీటిలో బి1, బి2, బి6 వంటి విటమిన్లు ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది.

గంజి నీళ్లు తాగినా,  చర్మానికి అప్లై చేసినా చర్మం చికాకులు తగ్గుతాయి.  చర్మం ఛాయ మెరుగవుతుంది.

గంజి నీళ్లలో ఉండే పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేసి రక్తపోటును నియంత్రిస్తుంది.

గంజి నీళ్లలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి  ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలను దూరం చేస్తుంది.

గంజి నీళ్లలో కేలరీలు తక్కువ.  ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఆకలిని నియంత్రించి అతిగా తినడాన్ని ఆపుతుంది.

గంజి నీళ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  ఇది ప్రేగు కదలికలను మెరుగ్గా ఉంచి మలబద్దకాన్ని నివారిస్తుంది.