ప్రతిరోజూ సూర్య నమస్కారాలు వేస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

సూర్య నమస్కారాలు యోగలో శక్తివంతమైన  వ్యాయామం.  ఇందులో 12 ఆసనాలు ఉంటాయి.

రోజూ సూర్యనమస్కారాలు చేస్తే 12 ఆసనాలు ఒక దాని తరువాత ఒకటి చేసినట్టు అవుతుంది. ఇది శరీరపు ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది.

సూర్యనమస్కారాలు చేసేటప్పుడు హృదయ స్పందన రేటు పెరుగుతుంది.  గుండె కండరాలు బలపడతాయి. ఇది గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

సూర్య నమస్కారాలు చేసేటప్పుడు శ్వాస కూడా ఒక క్రమ పద్దతిలో సాగుతుంది.  ఇది శ్వాస కోశ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.

 సూర్య నమస్కారాలు వేసేటప్పుడు జరిగే  ఉచ్వాస,  నిశ్వాసలు మానసిక ప్రశాంతతను, భావోద్వేగ నియంత్రణకు సహాయపడతాయి.

క్రమం తప్పకుండా సూర్యనమస్కారాలు వేస్తుంటే శరీరంలో అదనపు కొవ్వు తగ్గుతుంది. బరువు తగ్గడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

సూర్య నమస్కారాలలో శరీరంలో వివిధ భంగిమలలోకి మారుతూ ఉంటుంది. దీని వల్ల కండరాలు, కీళ్లు బలంగా మారతాయి.

సూర్య నమస్కారాలు వేసేటప్పుడు శరీరం సాగదీతకు లోనవుతుంది.  ఇది  జీర్ణక్రియ మెరుగ్గా ఉండటంలో సహాయపడుతుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రోజూ సూర్య నమస్కారాలు వేస్తుంటే థైరాయిడ్,  పిట్యూటరీ, అడ్రినల్, ఎండోక్రైన్  గ్రంధులు ప్రేరేపించబడతాయి.  ఇది  హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.