జాపత్రిని ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలివే..!

భారతీయ వంటింటి మసాలా దినుసులలో జాపత్రి ఒకటి.

జాపత్రిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. దీన్ని ఆహారంలో తీసుకుంటూ ఉంటే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

దగ్గు, జలుబు తగ్గించడంలో జాపత్రి సమర్థవంతంగా పనిచేస్తుంది.

వర్షాకాలంలో ఎక్కువగా ఎదురయ్యే వైరల్ రిలాప్స్,  ఫ్లూ సమస్యల నుండి రక్షిస్తుంది.

దగ్గు సిరప్ లు,  వాపోరబ్ లు తయారు చేయడంలో దీన్ని ఉపయోగిస్తారు.

జాపత్రిలో యాంటీ అలెర్జీ,  యాంటీ ఆక్సిడెంట్,  యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు ఉంటాయి.   ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.

జాపత్రిలో నోటి బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడే మూలకాలు ఉంటాయి.  ఇది నోటి ఆరోగ్యానికి చాలా మంచిది.

వర్షాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే విరేచనాలు,  కడుపు నొప్పి, పేగు సంబంధ సమస్యలు తగ్గించడంలో జాపత్రి అద్బుతంగా సహాయపడుతుంది.

జాపత్రి కిడ్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.  జాపత్రిలో ఉండే సమ్మేళనాలు కిడ్నీకి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరిస్తాయి.