పచ్చిపాలను ముఖానికి రాసుకుంటే ఇంత అందమా? ఒక్కసారి ట్రై చేసి చూడండి!
అమ్మాయిలు సాధారణంగా ఫేస్ ప్యాక్ లలో పాలు ఉపయోగిస్తుంటారు. కానీ పచ్చిపాలు ముఖానికి రాసుకుంటే ఎంత ఖరీదైన బ్యూటీ ప్రోడక్ట్ వాడినా రాని ఫలితాలు ఉంటాయి.
పచ్చిపాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది.
పచ్చిపాలలో ఉండే నూనెలు చర్మానికి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తాయి. తేమను లాక్ చేసి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
ముఖం మీద మచ్చలు, మొటిమలు, నల్లమచ్చలు, ముడుతలు తగ్గించి ముఖాన్ని కాంతివంతంగా, యవ్వనంగా మారుస్తుంది.
పచ్చిపాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మం చికాకులు, మొటిమలు, ఎర్రబడిన చర్మాన్ని ట్రీట్ చేస్తాయి.
ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ముఖం మీద గీతలు, ముడుతలు తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. వృద్దాప్య ఛాయలు రానివ్వవు.