బరువు తగ్గాలనుకునే వారికోసం భలే టిఫిన్లు.. వీటిలో కేలరీలు చాలా తక్కువ..!

బరువు తగ్గాలని అనుకునేవారికి ఆహారం తీసుకోవడం పెద్ద క్లిష్టమైన సమస్య. ఏ ఆహారం తినాలన్నా కేలరీలు గుర్తొస్తాయి.

రుచికరంగా ఉంటూ కడుపు నిండుగా తినగలిగే టిఫిన్లు తీసుకుంటే ఎలాంటి భయం ఉండదు.

ఓట్స్ ఇడ్లీ.. ఓట్స్ ఇడ్లీ లో కేలరీలు తక్కువగా ఉంటాయి.  విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు వీటి నుండి లభిస్తాయి.  రుచికి రుచి.. డైటింగ్ చేసేవారికి మంచిది.

ఢోక్లా.. ఢోక్లా  అనేది గుజరాత్ కు చెందిన వంటకం.  ఆవిరిలో ఉడికించి చేసే ఈ వంటకంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.  కేలరీలు తక్కువగా ఉంటాయి.

మష్రూమ్ చికెన్ ఆమ్లెట్.. బరువు తగ్గేవారి డైట్ లో గుడ్లు తప్పక ఉంటాయి.  వీటికి జతగా చికెన్,  మష్రూమ్ జోడిస్తే పోషకాలు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కేలరీలు కూడా తక్కువే..

బనానా, బాదం ఫుడ్డింగ్.. ఓట్స్ ఫుడ్డింగ్ ఫిట్‌నెస్ గోల్ ను చేరుకోవడంలో బాగా సహాయపడుతుంది.  చియా సీడ్స్,  మిల్క్ ప్రోటీన్, బాదం మొదలైనవాటితో సూపర్ ఫుడ్ గా పరిగణింపబడుతుంది.

పాలకూర పాన్ కేక్.. పాలకూరలో కేలరీలు తక్కువ.  ప్రోటీన్ ఎక్కువ.   పాన్ కేక్ లేదా దోశ వంటివి వీటితో తయారుచేసుకోవచ్చు.  రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.

పెసరపప్పు చీలా.. పెసరపప్పు మంచి ప్రోటీన్ మూలకం. . ఇందులో  కేలరీలు తక్కువ పోషకాలు ఎక్కువ.