దంతాల మీద ఎర్రగా గార పేరుకుపోయిందా? ఈ టిప్స్ తో వదిలించుకోవచ్చు..!
దంతాలను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం చేసినా, ధూమపానం, కెఫిన్ ఎక్కువగా తీసుకున్నా దంతాలలో గార పేరుకుపోతుంది. దీన్ని కొన్ని టిప్స్ తో ఈజీగా వదిలిచుకోవచ్చు.
నిమ్మకాయ, బేకింగ్ సోడా మిక్స్ చేయాలి. ఉదయం, సాయంత్రం దీంతో బ్రష్ చేసుకుంటే పళ్లమీద గార వదిలిపోతుంది.
దానిమ్మ తొక్కల పొడిలో ఉప్పు, మిరియాల పొడి వేసి పౌడర్ చేసుకోవాలి. దీంతో బ్రష్ చేసుకోవాలి. దంతాల మీద గార మెల్లిగా తగ్గడం చూడొచ్చు.
ఒక చెంచా ఆవాల నూనెలో ఒక చెంచా ఉప్పు కలపాలి. దీన్ని దంతాల మీద రుద్దాలి. దీంతో గార పోవడమే కాదు, చిగుళ్ల సమస్యలు కూడా తగ్గుతాయి.
వేప ఆకులను పేస్ట్ చేసి దాంతో దంతాలను రుద్దాలి. దంతాల మీద గార తొలగిపోవడమే కాకుండా నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది.
కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చెయ్యడం వల్ల గార తగ్గుతుంది.