ఆహారం, నీళ్లు లేకుండా  ఎక్కువకాలం జీవించే   జంతువులు ఇవే!

 పైథాన్ వంటి పాములకు జీవక్రియ నెమ్మదిగా ఉండటం వల్ల.. ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవించగలవు. 

మొసలి జీవక్రియను నెమ్మదిగా తగ్గించుకుంటూ నెలల పాటు ఆహారం లేకుండా జీవించగలదు.

ఒంటె.. నెలల పాటు  నీరు, ఆహారం లేకుండా జీవించగలదు. 

నేలపై జీవించే నత్తలు ఎంతో కాలం ఆహారం, నీళ్లు లేకుండా జీవించగలవు.

కంగారు ఎలుకలు వాటి జీవితాంతం నీరు తాగకుండా జీవించగలవు.

 ఎలుగుబంట్లు ఆహారం, నీళ్లు లేకుండా ఉంటాయి. వాటి శరీరంలో నిల్వ ఉంచుకున్న కొవ్వుతో జీవిస్తాయి.

అంటార్కిటికా ప్రాంతంలో జీవించే పెంగ్విన్ పక్షులు, గుడ్లు పొదిగే దశలో నెలల పాటు ఆహారం తీసుకోకుండా జీవించగలవు.