యవ్వనంగా ఉండటానికి ఆయుర్వేదం చెప్పిన రహస్య చిట్కాలు..!
అభ్యంగ స్నానం లేదా ఆయిల్ మసాజ్ శరీరంలో పిత్త దోషాన్నిసమతుల్యంగా ఉంచుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
పాలను ముఖానికి వాడితే ముఖ రంధ్రాలలో సెబమ్ లేదా నూనె పేరుకుపోకుండా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
యోగా, ప్రాణాయామం చేస్తుంటే యవ్వనంగా, అందంగా కనిపిస్తారు. శరీర దృఢత్వం పెరుగుతుంది.
తేనె సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. తేనెను పలుచని పొరగా ముఖమంతా అప్లై చేసి 15 నిమిషాల కడగాలి. దీన్ని వారంలో రెండుసార్లు చేస్తున్నా ముఖం మృదువుగా ఉంటుంది.
వేప పొడి, తేనె.. రెండింటిని మిక్స్ చేసి చర్మానికి ప్యాక్ వేసుకోవాలి. చర్మ సంబంధ సమస్యలన్నీ తొలగిపోతాయి.
వేపుళ్లు, కారంగా ఉండే ఆహారాలు మానేయాలి. పైబర్, నీటిశాతం కలిగిన పండ్లు, కూరగాయలు బాగా తీసుకోవాలి.
శరీరంలో టాక్సిన్లు బయటకు వెళ్లడంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. నీరు పుష్కలంగా తాగాలి.
తలస్నానం చేసేముందు గందం పొడి, పుదీనా పొడిని రోజ్ వాటర్ తో మిక్స్ చేసి ఫేస్ మాస్క్ లేదా బాడీ మాస్క్ వేసుకోవాలి. అద్బుతమైన ఫలితాలు ఉంటాయి.
యాంటీ ఏజింగ్ ఉత్పత్తులలో సరస్వతి ఆకులను ఉపయోగిస్తారు. దీన్ని మండూకపర్ణి, బ్రహ్మీ అని కూడా పిలుస్తారు. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.