రోజూ మధ్యాహ్నం ఓ కునుకు తీస్తే కలిగే ప్రయోజనాలు ఇవే!
ఈ కునుకులతో ఆరోగ్య సమస్యలు చాలా వరకూ దరిచేరవు. బీపీ నియంత్రణలో ఉండి గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం తగ్గుతుంది.
మధ్యాహ్నం నిద్రతో సెరెటోనిన్ డోపమైన్ విడుదలై ఒత్తిడి తగ్గుతుంది.
పవర్ నాప్స్‌తో మెదడు రిఫ్రెష్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు
విషయాలను అవగాహన చేసుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయట. విషయాలు సుదీర్ఘకాలం గుర్తుంచుకునే సామర్థ్యం ఇనుమడిస్తుందట.
విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మధ్యాహ్నం 20 నిమిషాలు నిద్రపోవడం వల్ల మధుమేహం, గుండె సమస్యలు, నిరాశ వంటి సమస్యలను కూడా తగ్గిపోతాయట.
ఇలా చిన్న కునుకు తీసేవారు ఇతరులతో పోలిస్తే మరింత ఆరోగ్యంగా సంతృప్తికరమైన జీవనం సాగిస్తారట.