రైస్ వాటర్ లో అమినో యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టుకు పోషణనిచ్చి బలోపేతం చేస్తాయి. జుట్టు విరిగిపోవడాన్ని ఆపుతాయి.
బియ్యం నీటిలో ఉండే ప్రోటీన్లు జుట్టు పెళుసుబారడాన్ని నివారిస్తుంది. జుట్టుకు ఎలాస్టిక్ గుణాన్ని మెరుగుపరుస్తుంది.
జుట్టు చివర్లు చిట్లిపోకుండా బియ్యం నీటిలో పోషకాలు సహాయపడతాయి.
బియ్యం నీరు జుట్టు క్యూటికల్ చుట్టూ రక్షణ పొరను ఏర్పరుస్తుంది. జుట్టు సహజంగా మెరవడంలో సహాయపడుతుంది.
జుట్టు చర్మంలో దురద, చికాకు వంటి సమస్యలు తగ్గించడంలో రైస్ వాటర్ చక్కగా సహాయపడుతుంది.
బియ్యపు నీటిలో ఉండే ఇనోసిటాల్ దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
రైస్ వాటర్ జుట్టు సహజ pH బ్యాలెన్స్ ను మైంటైన్ చేస్తుంది. జుట్టు ఎక్కువ జిడ్డుగా లేదా పొడిగా ఉండటాన్ని నివారిస్తుంది.
Title 1
బియ్యం నీటిని జుట్టుకు అప్లై చేస్తే జుట్టు చిక్కులు ఉండదు. జుట్టు సిల్కీగా దువ్వడం చాలా సులభంగా ఉంటుంది.
బియ్యం నీటి కోసం ఒక కప్పు బియ్యాన్ని కడిగి రెండు కప్పుల నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటిరోజు ఈ నీటిని వడగట్టి 5-10 నిమిషాలు వేడి చేయాలి. నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు నీటిని తలకు పట్టించి బాగా మాసాజ్ చేసుకోవాలి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత జుట్టును కడిగేయాలి.