టీనేజ్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే బిగ్ మిస్టేక్స్ ఇవే..!

టీనేజ్ పిల్లల ఆలోచనలను, వారు చెప్పే విషయాలను కొందరు తల్లిదండ్రులు పట్టించుకోరు.  అది పేరెంట్స్ కు  పిల్లలకు మధ్య దూరాన్ని పెంచుతుంది.

 పిల్లలకు స్వేచ్చనివ్వాలి.  అలాగే తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి. అంతేతప్ప కఠినంగా కట్టడి చేయడం తప్పు.

టీనేజ్ వయసు పిల్లలకు అన్ని భావోద్వేగాలు  ఎక్కువగానే ఉంటాయి. వారు ఏడుస్తున్నా, బాధపడినా వారిని అర్థం చేసుకుని మాట్లాడాలి.  లేకపోతే  ఒంటరిగా ఫీల్ అవుతారు.

పిల్లలు పెరిగే కొద్ది వారు కూడా ఆలోచించడం నేర్చుకుంటారు. వారు సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోనివ్వకుండా చేయడం వల్ల పిల్లలు అసమర్థులుగా తయారవుతారు.

పిల్లలను ఇతరులతో పోల్చడం చాలా పెద్ద తప్పు. ఇది పిల్లలలో సెల్ఫ్ రెస్పెక్ట్ ను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను దెబ్బతీస్తుంది.

పిల్లల గురించి అతిగా కేరింగ్ తీసుకోవడం కూడా తప్పే. ఒకదశలో అది వారికి కంచెలాగా అనిపిస్తుంది. వ్యక్తిగత ఎదుగుదలకు నష్టం కలిగిస్తుంది.

పిల్లలలో ఒత్తిడి లేదా ఆందోళన వంటివి గమనిస్తే తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఊహించని పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

పిల్లల మీద అర్థం లేని ఎక్ప్పెక్టేషన్స్ పెట్టుకుని వాటిని పిల్లల ముందు వ్యక్తం చేయకూడదు. అవి పిల్లల జీవితాన్ని చాలా ఒత్తిడికి లోను చేస్తాయి.

పిల్లలు ఎంత బాగా చదివినా, మంచి పనులు చేసినా కొందరు తల్లిదండ్రులు మెచ్చుకోరు. ఇలా చేస్తే పిల్లల చదువు, నడత దెబ్బతింటుంది.