కాన్ఫిడెన్స్
ఎక్కువైతే కలిగే నష్టాలివే!
ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉండే వ్యక్తులు అనవసరమైన రిస్క్‌లు ఎక్కువగా తీసుకుంటారు.
తాము విఫలం కామని వారు బలంగా నమ్ముతారు. ఆ ధోరణి తీవ్ర నష్టాలు తీసుకురావచ్చు.
మితిమీరిన ఆత్మవిశ్వాసం గల వ్యక్తులు ఇతరుల మాటలను, సలహాలను పట్టించుకోరు.
చుట్టుపక్కల వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ఇష్టపడరు.
అతి విశ్వాసం కలిగి ఉండడం ఇతరులకు అహంకారంలా కనిపిస్తుంది. దీంతో వ్యక్తిగత, వృత్తిగత సంబంధాలు దెబ్బతింటాయి.
తమ ఆలోచనల పట్ల అతి విశ్వాసం కలిగిన వ్యక్తులు కొత్త ఐడియాలను, సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయరు.
మితిమీరిన ఆత్మవిశ్వాసం గల వ్యక్తులు తమ సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటారు. ఎదురయ్యే సవాళ్లను తక్కువగా అంచనా వేసి ఇబ్బందుల పాలవుతారు.
ఆర్థిక నిర్ణయాలపై అతి విశ్వాసం అధిక ఖర్చులకు లేదా తీవ్ర నష్టాలకు దారి తీస్తుంది.
అతి విశ్వాసం గల వ్యక్తులు ఓ టీమ్‌తో కలిసి పని చేయలేరు. తమ ఆలోచనలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నిస్తారు.
Related Web Stories
గులాబ్ జామూన్ చేయడం ఎలా..
సిగరెట్ మానేయాలంటే వీటిని తినండి..
ప్రపంచంలో అత్యధిక శాతం మంది మాట్లాడే భాషలు ఇవే
చన్నీళ్లు vs వేడి నీళ్లు.. రెండింటిలో ఏవి మంచివి?