మీ ఆయుష్షు పెరగాలంటే.. ఈ విటమిన్లు తీసుకోండి.. 

విటమిన్-డి.. కాల్షియం శోషణను పెంచి ఎముకలను పటిష్టం చేయడంలో విటమిన్-డిది కీలక పాత్ర. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 

విటమిన్-కే.. ధమనుల కాల్సిఫికేషన్‌ను నివారించి గుండెను కాపాడుతుంది. కాల్షియంను రెగ్యులేట్ చేయడం ద్వారా బలమైన ఎముకల నిర్మాణానికి సహాయపడుతుంది. 

విటమిన్-బి12.. మెదడు ఆరోగ్యానికి, కాగ్నిటివ్ ఫంక్షనాలిటీకి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి విటమిన్-బి12 ఎంతో అవసరం. 

విటమిన్-ఈ.. శరీరంలోని కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు. ఎల్‌డీఎల్ కొలస్ట్రాల్‌ ఆక్సీకరణను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

విటమిన్-సి.. ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సీ విటమిన్ ద్వారా లభిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. 

సమతుల ఆహారం.. అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా లభించేలా సమతుల ఆహారం తీసుకోవాలి. శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు, ప్రోటీన్లు అందిస్తే ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించగలుగుతారు. 

సప్లిమెంట్స్ vs నేచురల్ సాధారణంగా ఆహారం నుంచి పోషకాలను, విటమిన్లను శరీరానికి అందించే వీలు కుదరకపోతే విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ఉత్తమం. 

యాంటీ-ఆక్సిడెంట్స్ యాంటీ-ఆక్సిడెంట్స్‌ను పుష్కలంగా కలిగి ఉండే విటమిన్లు అయిన ఏ, సీ, ఈ వయస్సు ప్రభావాలను తగ్గిస్తాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.