అక్షయ తృతీయ గురించి ఈ నిజాలు తెలుసా..?
వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథిరోజు అక్షయ తృతీయ జరుపుకుంటారు. హిందూ మతంలో అక్షయ తృతీయ చాలా పవిత్రమైనరోజు.
మే 10 వ తేదీ ఉదయం 5:33 నుండి మధ్యాహ్నం 12:18 వరకు ఈ ఏడాది అక్షయ తృతీయ పూజ సమయం ఉంటుంది.
అక్షయ తృతీయ రోజున పరశురాముడు జన్మించాడు. ఇదే రోజున వేదవ్యాసుడు మహాభారతం రాయడం మొదలుపెట్టాడు.
అక్షయ తృతీయ రోజు మహావిష్ణువును, లక్ష్మీ దేవిని పూజించడం పవిత్రమైనదిగా భావిస్తారు.
అక్షయతృతీయ రోజు చేసే దానం వల్ల కలిగే పుణ్యఫలం చిరకాలం నిలుస్తుంది.
గంగా నది లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసి ఆ తరువాత దానం చేయాలి.
అక్షయ తృతీయ రోజున మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది.
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
Related Web Stories
కొత్త మట్టి కుండను వాడే ముందు..!
గాజులు అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..!
మిగిలిపోయిన ఆహారంతో చేసుకునే.. 9 రుచికరమైన వంటలివే..
జాగ్రత్త.. వేసవి కాలంలో ఈ కూరగాయలను తినకండి..