ఈ జంతువులు చాలా స్పీడ్..
వీటి వేగాన్ని అందుకోవడం అసాధ్యం!
ఈ భూమి మీద అతి వేగంగా పరిగెత్తే జంతువు చిరుత పులి. ఒక గంటకు చిరుత 97-113 కిలో మీటర్ల వేగంతో పరిగెత్తగలదు.
ఫ్రాంగ్ హార్న్ అనే లేడి జాతి జీవి గంటకు 88 కిలోమీటర్ల వేగంతో పరిగెత్త గలదు. చిరుత తర్వాత ఈ భూమి మీద అతి వేగంగా పరిగెత్తే జంతువు ఇదే.
లేడి జాతికే చెందిన స్ప్రింగ్ బాక్స్ కూడా గంటకు 88 కిలోమీటర్ల వేగంతో పరిగెత్త గలవు. ఇవి పరిగెత్తడమే కాకుండా, చాలా దూరం దూకగలవు కూడా.
పెరెగ్రైన్ ఫాల్కన్ అనే పక్షి అత్యంత వేగవంతమైన పక్షి. ఇది గంటకు 386 కిలో మీటర్ల వేగంతో ఎగరగలదు.
అత్యంత వేగంగా ఎగిరే పక్షులలో ఫ్రిగేట్ బర్డ్ జాతి ఒకటి. ఇవి గంటకు 153 కిలో మీటర్ల వేగంతో ఎగరగలవు.
బ్లాక్ మార్లిన్ అనే చేప దాని అసాధారణ బలానికి, వేగానికి ప్రసిద్ధి. ఇది గంటకు 132 కిలోమీటర్లు వేగంతో ఈదగలదు.
సెయిల్ ఫిష్ కూడా అత్యంత వేగంగా ఈదగలిగే చేప. ఇది సముద్ర జలాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
Related Web Stories
ఈ 9 అలవాట్లతో.. 100 ఏళ్ల జీవితం మీ సొంతం..
పురుషులను చూడగానే మహిళలు మొదట గమనించేవి ఇవే!
చేప నూనె వల్ల కలిగే 8 ఆరోగ్యప్రయోజనాలివే..!
ఈ జంతువులకు ఆహారం పేరు పెట్టారు.. అవేమిటంటే..!