ఉదయం పరుగు తర్వాత తినవలసిన ఆహారాలు ఇవే..

ఉదయం పూట చేసే వ్యాయామం తర్వాత శరీరం అలసిపోతుంది. దీని నుంచి వెంటనే తేరుకోవాలంటే.. ఆరోగ్యాన్ని పెంచి, శక్తిని ఇచ్చే ఆహారాలను తీసుకోవాలి.. అవేమిటంటే..

పిండి పదార్థాలు.. గ్లైకోజెన్ నిల్వలను పెంచేందుకు క్వినోవా, చిలగడదుంపలు, తృణధాన్యాలు వంటి కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి.

ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కండరాలను రిపేర్ చేయడంలో సహాయడటానికి గ్రీక్ పెరుగు, కాటేజ్ చీజ్ లేదా ప్రోటీన్ బార్‌ వంటి అధిక ప్రోటీన్ అల్పాహారాన్ని తీసుకోవాలి.

ఎలక్ట్రోలైట్.. స్పోర్ట్స్ డ్రింక్స్.. కొబ్బరి నీరు లేదా ఇంట్లో తయారు చేసిన ఎలక్ట్రోలైట్ ద్రావణంతో ఎలక్ట్రోలైట్ స్థాయిలను పెంచవచ్చు.

పరుగు తర్వాత పండ్లు, ఆకు కూరలు, ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి. త్వరగా, ఆరోగ్యంగా కోలుకోవడంలో సహాయపడే పోషకమైన స్మూతీని తీసుకోవాలి. 

పరుగు పెట్టే సమయంలో హైడ్రేటెడ్‌గా ఉండటానికి, కోల్పోయిన ఏవైనా ద్రవాలను భర్తీ చేయానికి నీరు త్రాగాలి.

ఒమేగా 3 ఆహారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ పోషకాలను పొందడానికి సాల్మన్ వంటి కొవ్వు చేపలను తీసుకోవాలి.