ఉదయాన్నే వెల్లుల్లి తింటే ఇన్ని ప్రయోజనాలా?
తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో వెల్లుల్లిని మించినది లేదు. ఫలితంగా అలెర్జీలను, ఇన్ఫెక్షన్లను నియంత్రించే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం రక్తకణాలను వ్యాకోచింప చేసి రక్తప్రసరణ సజావుగా సాగేలా చూస్తుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది.
శరీరంలో హెచ్‌డీఎల్ కొలస్ట్రాల్‌ను పెంచి ఎల్‌డీఎల్ కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
వెల్లుల్లిలోని ఫ్లేవనాయిడ్స్, యాంటీ-ఆక్సిడెంట్స్, విటమిన్-సి, సెలేనియం వంటి పోషకాలు ఆక్సిడేటిడ్ డ్యామేజ్ నుంచి కణాలను కాపాడతాయి.
వెల్లుల్లిలో గట్ బ్యాక్టీరియాను పెంపొందించి జీర్ణ వ్యవస్థను కాపాడే ప్రో బయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి.
వెల్లుల్లిలో శరీరానికి మేలు చేసే సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి.
శరీరంలోని కణాలు పూర్తిగా ఆక్సిజన్ గ్రహించేలా చేయగలిగే రసాయన సమ్మేళనాలు వెల్లుల్లిలో ఉంటాయి.
వెల్లుల్లి యాంటీ-వైరల్, యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి తింటే జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు దూరమవుతాయి.
వెల్లుల్లిలో ఉండే డయాలిల్ డై సల్ఫైడ్ అనే రసాయనం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
Related Web Stories
టీతో తినకూడని ఆహార పదార్థాలు ఇవే..
మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఉత్తమ ఆహారాలు ఇవే..!
ఈ ఆహార చిట్కాలను ఫాలో అయితే వానాకాలం వ్యాధుల్ని ఆపవచ్చు...!
వేడి పాలు vs చల్లని పాలు: ఏవి ఆరోగ్యానికి మంచివి?