భోజనం తర్వాత పాన్ తినడం వల్ల ఏం జరుగుతుందంటే.. 

భోజనం తర్వాత తమలపాకుతో చేసిన పాన్ నమలడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 

తమలపాకులు జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి. ఫలితంగా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. 

పాన్ నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.

తమలపాకు యాంటీ-మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నోటిలోని బ్యాక్టీరియాను నియంత్రించి గమ్ డిసీజ్‌ రాకుండా కాపాడుతుంది. 

కడుపులో ఉండే యాసిడ్ లెవెల్స్‌ను పాన్ బ్యాలెన్స్ చేస్తుంది. భోజనం తర్వాత ఎసిడిటీ పెరగకుండా కాపాడుతుంది. 

మలబద్ధకాన్ని నివారించడంలో కూడా పాన్ మెరుగ్గా పని చేస్తుంది. 

తమలపాకులో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడి ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

పాన్ తరచుగా నమలడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది.