నిద్రకు ముందు వెల్లుల్లి తింటే ఇన్సోమ్నియా తగ్గుముఖం పడుతుంది. సుఖంగా నిద్ర పడుతుంది.
నిద్రపోయే ముందు ఒక వెల్లుల్లి రెబ్బను తిన్నా రాత్రంతా రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
వెల్లుల్లిలో సల్ఫర్ సమృద్ధిగా ఉంటుంది. రాత్రివేళ తింటే నిద్రలో గుండెపోటు వచ్చే ప్రమాదం నుంచి కాపాడుతుంది.
పచ్చి వెల్లుల్లి పేగుల్లో చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
వెల్లుల్లిలోని యాంటీ-యాక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ప్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. రోజంతా ఎదుర్కొన్న ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
రాత్రివేళ పచ్చి వెల్లుల్లిని తింటే జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రపోయేటపుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది.