బొప్పాయి పండులో ఎన్ని పోషకాలున్నాయో తెలుసా..!

బొప్పాయికి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పేర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో దీనిని పావ్‌పా అని పిలుస్తారు.

బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉన్నాయి. 

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

బొప్పాయిలో పపైన్, చైమోపాపైన్ అనే రెండు ఎంజైములు ప్రోటీన్‌లను త్వరగా జీర్ణం చేస్తాయి.

విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

బొప్పాయి తినడం వల్ల బాక్టీరియా, వైరల్ వ్యాధులతో పోరాడటానికి సహకరిస్తుంది.

బొప్పాయి గింజల్లోని బయోయాక్టివ్ సమ్మేళనాలు మంటను తగ్గిస్తాయి.

బొప్పాయి మాస్క్ ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.