వావ్.. మఖానా తినడం వల్ల  ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా? 

మఖానా ఓ పోషకాల గని. వీటిల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అత్యంత ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. 

మఖానాలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా, సోడియం తక్కువగా ఉంటాయి. మఖానా రక్తపోటును నియంత్రణలో ఉంచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

మఖానాలో ఫైబర్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో మఖానా కీలక పాత్ర పోషిస్తుంది. 

మఖానాలో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. మఖానా తిన్న చాలా సేపటి వరకు ఆకలి వేయదు. 

మఖానాలో కాల్షియం స్థాయులు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. 

శరీరంలో జరిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను మఖానా సమర్థంగా నియంత్రిస్తుంది. జుట్టు, చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. 

ఉదయం సమయంలో మఖానా తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. రోజుంతా చురుగ్గా ఉండడానికి మఖానా బ్రేక్‌ఫాస్ట్ మంచిది. 

మఖానాలో కార్బొహైడ్రేట్స్ తక్కువ స్థాయిలో ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు, బరువు తగ్గాలనుకునే వారికి మఖానా ఆరోగ్యకరమైన స్నాక్