ఒక్క స్పూన్ బాదం నూనె తాగండి..  మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోండి!

బాదం గింజల నుంచి తయారు చేసే బాదం నూనెలో విటమిన్ ఎ, విటమిన్ ఈ, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక స్పూన్ బాదం నూనె తాగితే ఎన్నో ఉపయోగాలున్నాయి. 

ప్రతిరోజూ ఉదయాన్నే ఒక్క స్పూన్ బాదం నూనె తాగితే మీ మెటబాలిజమ్ మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ చిట్కా పాటిస్తే మంచిది. 

ఆల్మండ్ ఆయిల్ చర్మానికి లోపలి నుంచి పోషణ ఇస్తుంది. చర్మంపై తేమను నిలిపి ఉంచుతుంది. చర్మ సంరక్షణకు ఎంతో తోడ్పడుతుంది. గజ్జి, తామర వంటి వ్యాధులకు బాదం ఆయిల్ మంచి మందు. 

మధుమేహం ఉన్న వారు ఉదయాన్నే స్పూన్ బాదం నూనె తాగడం మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. 

బాదం నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అల్జీమర్స్ వంటి న్యూరో డీజెనరేటివ్ డిజార్డర్స్ రాకుండా అడ్డుకుంటాయి.

బాదంలో ఉండే ముఖ్యమైన కొవ్వులు, విటమిన్లు జుట్టు రాలడాన్ని అరికడతాయి. తలకు రాసుకుంటే హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజపరిచి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. 

బాదం నూనెలో కాల్షియం, మెగ్నీషియం కూడా తగు మోతాదులో ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

బాదం నూనె ఉదయాన్నే తాగడం వల్ల పేగు కదలికలను నియంత్రిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. 

బాదం నూనెలో శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.